మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN , First Publish Date - 2022-10-03T17:44:26+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల (Munugode bypoll) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Central election commission) విడుదల చేసింది.

మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

నల్లగొండ : ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు కొంతకాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మునుగోడు ఉపఎన్నిక (Munugode bypoll) షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Central election commission) విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ (by poll polling).. అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharastra), హర్యానా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఒడిశా (Odisha) ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌ (Bihar)లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.


కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. మూడు పార్టీలకు ఈ విజయం తప్పనిసరి కావడంతో బాగా ఫోకస్ పెట్టాయి. బీజేపీ (BJP) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ యాక్షన్ ప్లాన్‌ (Action Plan)ను సిద్ధం చేసింది. దసరా తరువాతి రోజు నుంచి మునుగోడుపై దండయాత్రకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 7వ తేదీ నుంచి మునుగోడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ (Bandi Sanjay) ఫోకస్ చేయనున్నారు.‌ ప్రతి నేత.. ప్రతి ఇంటిని టచ్ చేసేలా ప్రచారానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈనెల 7న మునుగోడులో అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్ యాత్రలు నిర్వహించనుంది. 10వ తేదీన బూత్ కమిటీ సభ్యలతో బండి సంజయ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. 189 గ్రామాల్లో జరగనున్న బైక్ యాత్రల్లో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.


ఇక టీఆర్ఎస్ పార్టీ సైతం మునుగోడుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారుల బదిలీలు.. వామపక్షాలను తమవైపు తిప్పుకోవడంలో ముందుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడులో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరుఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. రోజుకో సీనియర్ నేత మునుగోడుకు వెళ్లి ఆమె తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. 

Read more