TDP On Munugode: మునుగోడు ఉప ఎన్నికలో టీడీపీ ఎటు వైపు ?

ABN , First Publish Date - 2022-10-08T21:06:17+05:30 IST

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అయితే మునుగోడు ఉపఎన్నిక బరిలో...

TDP On Munugode: మునుగోడు ఉప ఎన్నికలో టీడీపీ ఎటు వైపు ?

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అయితే మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉండాలా? లేదా? అన్న దానిపై అధిష్టానం నిర్ణయం కోసం స్థానిక నేతలు వేచి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించి, తాజా పరిస్థితులపై చర్చించారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో టీడీపీకి దాదాపు 5వేల సభ్యత్వం ఉంది. మరోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి, తమ సత్తా ఏమిటో తేల్చుకుందామని పలువురు నేతలు అధిష్టానంతో చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంశం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-10-08T21:06:17+05:30 IST