సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం.. కేసీఆర్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-02-19T17:51:17+05:30 IST

నేటి సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు చినజీయర్ స్వామి ఆహ్వానం పంపారు.

సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం.. కేసీఆర్‌కు ఆహ్వానం

రంగారెడ్డి : నేటి సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు చినజీయర్ స్వామి ఆహ్వానం పంపారు. రేపు ముంబయ్‌లో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశం పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా మేడారం పర్యటనను రద్దు చేసుకున్నారు. కాబట్టి ముచ్చింతల్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనక పోవచ్చని సీఎంవో వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌తో విభేధాలు లేవని చిన్నజియ్యర్ స్వామి తెలిపారు. కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

Read more