కేసీఆర్, కేటీఆర్‌లపై komatireddy venkatreddy ఫైర్

ABN , First Publish Date - 2022-07-06T20:46:01+05:30 IST

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌లపై komatireddy venkatreddy ఫైర్

యాదాద్రి: సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌ (KTR)లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బొమ్మలరామారం మండలం రామలింగపల్లిలో జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మోదీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని... ఇద్దరు దోచిపెట్టేది అదానీలకే దానికి తానే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు. సింగరేణి గోల్డ్ మైన్‌లో 40 వేల కోట్ల అవినీతిని త్వరలోనే బయటపెడతానన్నారు. సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఆ కాంట్రాక్టును నిలిపివేసి 40 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడుతానని తెలిపారు. పార్లమెంట్‌లో గళం విప్పి అవినీతిని అడ్డుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

Read more