కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం: Komati reddy

ABN , First Publish Date - 2022-07-14T17:35:23+05:30 IST

కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం: Komati reddy

హైదరాబాద్: కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నీటిని వృధా చేసే ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టుకేమో పైసా నిధులు లేవన్నారు. రాష్ట్రం మొత్తం వరదలతో చెరువులు పొంగి పొర్లుతుంటే నల్గొండ జిల్లాలో ఒక్క చెరువు నిండలేదని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అధికారంలోకి రాగానే శ్రీశైలం సొరంగపనులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 12 గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు సర్వేలను జనం నమ్మరని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 

Read more