మోదీ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌: నారాయణ

ABN , First Publish Date - 2022-09-08T09:39:41+05:30 IST

గిరిజన హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ నంబర్‌వన్‌ క్రిమినల్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మండిపడ్డారు.

మోదీ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌: నారాయణ

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ నంబర్‌వన్‌ క్రిమినల్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మండిపడ్డారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశామని చెబుతున్న బీజేపీ.. అడవిపై గిరిజనులకు హక్కులు లేకుండా అటవీ హక్కు చట్ట సవరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ, ప్రధాని మోదీ స్నేహితుడని, బీజేపీ, ఎంఐఎంల మధ్య ముద్దులాట, గుద్దులాటగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ఎంఐఎంను సంతృప్తి పర్చేందుకే సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు.   


తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకుంటాం:చాడ

తెలంగాణలో బీజేపీ విస్తరణ ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట, రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మల్లికా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సీపీఐ మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ముసాయిదా నివేదికలపై జరిగిన చర్చకు సమాధానంగా వెంకట్‌రెడ్డి మాట్లాడారు.

Read more