బీజేపీ నేతలకు ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2022-09-17T16:43:04+05:30 IST

బీజేపీ నేతల (BJP Leaders)కు ట్విటర్‌ (Twitter)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntala Kavitha) ప్రశ్నల వర్షం కురిపించారు.

బీజేపీ నేతలకు ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

Hyderabad : బీజేపీ నేతల (BJP Leaders)కు ట్విటర్‌ (Twitter)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntala Kavitha) ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం (Telangana Protest)లో మీ పాత్ర ఏంటని బీజేపీ నేతలను ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్యతా ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటని నిలదీశారు. తెలంగాణ బిడ్డగా వీటి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర (Telangana History)ను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం.. ప్రజలు తిరస్కరించగానే వంచించడం బీజేపీకి అలవాటై పోయిందన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి బీజేపీ చేసిందేమీ లేదని కవిత విమర్శించారు.

Read more