కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం ఏది?

ABN , First Publish Date - 2022-07-05T05:55:49+05:30 IST

కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం ఏది?

కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం ఏది?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌

ప్రధాని తెలంగాణ వచ్చారు.. వంట రుచులు చూసి వెళ్లారు

ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ 

మహబూబాబాద్‌ టౌన్‌, జూలై 4: రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ వేసిన ప్రశ్నలకు ప్రధాని మోదీ స మాఽధానాలు ఏవని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయ క్‌ ప్రశ్నించారు. తెలంగాణ గడ్డపై చెప్పలేక పోతే ఢిల్లీకి వెళ్లాకనైనా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ముగ్గురు టీఆర్‌ఎస్‌ నేతల కుటుంబాలకు రూ.రెండేసి లక్షల చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రమా ధ బీమా చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడారు.  ప్రధాని మోదీ తెలం గాణకు వచ్చారు... వంట రుచులు చూసి వెళ్లారు తప్ప ఏ ఒక్క హామీని ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాపై స్థానిక బీజేపీ నేతలు ఎందుకు అడ గలేదని మండిపడ్డారు. కేవలం సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, సీఎంతో పెట్టుకుంటే ఢిల్లీ గద్దె దించడం ఖాయమని హె చ్చరించారు. మానుకోట అభివృద్ధి కోసం రూ.10 కోట్లు మంత్రి కేటీఆర్‌ మంజూరు చేయడం చాలా సంతోషకరమని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 54 కొత్త జీపీల భవన నిర్మాణాలకు నిధులు మం జూరు చేశారని తెలిపారు. మాటలు చెప్పడం కా దని, చేసి చూపించేది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ డాక్ట ర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎమ్డీ. ఫరీద్‌, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్‌, గద్దె రవి, యాళ్ల్ల మురళీధర్‌రెడ్డి, గోగుల రాజు, సురేం దర్‌, శంకర్‌, వెంకన్న, శివ పాల్గొన్నారు.

Read more