మాజీ ఎంపీ Subbiramireddy కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-07-05T19:35:25+05:30 IST

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి (Subbiramireddy)తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి(Jagga reddy) మంగళవారం భేటీ అయ్యారు.

మాజీ ఎంపీ Subbiramireddy కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి (Subbiramireddy)తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి(Jagga reddy) మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యడిగా నియమితులైనందుకు సుబ్బిరామిరెడ్డికి జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా అందరం కలిసి పని చేయాలని సుబ్బిరామిరెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జరిగిన అంశాలను సుబ్బిరామిరెడ్డికి జగ్గారెడ్డి వివరించారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై సుబ్బిరామిరెడ్డి పలు సూచనలు, సలహాలు చేశారు. 


Read more