గుట్ట’పై నిధుల దుర్వినియోగం?

ABN , First Publish Date - 2022-08-17T08:24:55+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పను ల్లో రూ.36.72 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చక్కర్లు కొడుతున్నాయి.

గుట్ట’పై నిధుల దుర్వినియోగం?

ఏకపక్షంగా రూ.36.72 లక్షల చెల్లింపులు

సామాజిక మాధ్యమాల్లో ఓచర్‌ చక్కర్లు 

యాదగిరిగుట్ట, ఆగస్టు 16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పను ల్లో రూ.36.72 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చక్కర్లు కొడుతున్నాయి. రిటైనింగ్‌ వాల్‌, ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ రూం, ఎల్‌పీజీ గ్యాస్‌ స్టేషన్‌కు అప్రోచ్‌ రోడ్‌, తదితర పనులకు సంబంధించిన బిల్లు చెల్లింపులను ఆడిట్‌తోపా టు అధికారుల అనుమతులు లేకుండా ఈవో గీతారెడ్డి ఏకపక్షంగా చేసినట్లు స్థానికులు, రాజకీయ నా యకులు ఆరోపిస్తున్నారు. ఆలయ ఉద్ఘాటన అనంత రం  వైటీడీఎ/బిల్‌/35/2022 ఫైల్‌ ద్వారా ఏమాత్రం సంబంధంలేని వివిధ విభాగాల ద్వారా జరిపిన ఖ ర్చుల నిమిత్తం రూ.36,72,266 నిధులను సంబంధిత విభాగాల అనుమతి లేకుండా చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై ఈవో గీతారెడ్డిని వివరణ కోరగా.. నిధుల చెల్లింపులో దుర్వినియోగం జరగలేదని, అన్నీ నిబంధనల ప్రకారమే చెల్లించినట్టు తెలిపారు.  

Read more