ప్రత్యేక విమానంలో మృతదేహాల తరలింపు: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-03-23T19:55:39+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోయగూడ ప్రమాద మృతులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు తరలించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ప్రత్యేక విమానంలో మృతదేహాల తరలింపు: మంత్రి తలసాని

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోయగూడ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు తరలించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈరోజు 6 మృతదేహాలు, రేపు మరో 5 మృతదేహాల తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బెంగుళూరుకు ఆరుగంటలకు ఉన్న విమానంలో ఆరు మృతదేహాలను తరలిస్తామని... ఈరోజు వెళ్లిన మృతదేహాలు బెంగళూరులో భద్రపరుస్తారని తెలిపారు. రేపు ఐదు మృతదేహాలను తరలించనున్ననట్లు చెప్పారు. రేపు వెళ్తున్న ఐదు మృతదేహాలను కలిపి మొత్తం 11 మృతదేహాలను స్వస్థలాలకు పంపిస్తారని తెలిపారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్‌లోని మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన మంత్రి తలసాని... మృతుల బంధువులతో మాట్లాడారు. 

Read more