వికారాబాద్‌లో మంత్రి Sabita indrareddy పర్యటన

ABN , First Publish Date - 2022-07-13T18:28:35+05:30 IST

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.

వికారాబాద్‌లో మంత్రి Sabita indrareddy పర్యటన

వికారాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita indra reddy) క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. ధారూర్ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను పరిశీలించారు. వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని, ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మంత్రితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల జిల్లాలో పర్యటించారు. 

Read more