Minister Ktr: కాలుకు గాయమైనా విధుల్లో నో కాంప్రమైజ్

ABN , First Publish Date - 2022-07-27T01:31:22+05:30 IST

కాలుకు గాయమై ఇంట్లో ఉంటున్నా మంత్రి కేటీఆర్ (Minister Ktr).. తన విధుల్లో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు....

Minister Ktr: కాలుకు గాయమైనా విధుల్లో నో కాంప్రమైజ్

హైదరాబాద్ (Hyderabad): కాలుకు గాయమై ఇంట్లో ఉంటున్నా మంత్రి కేటీఆర్ (Minister Ktr).. తన విధుల్లో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


అయితే తన కాలుకు గాయం కారణంగా మూడు వారాల పాటు వైద్యులు.. విశ్రాంతి తీసుకోమన్నారని.. కాలక్షేపం కోసం ఓటీటీ (OTT)లో మంచి సినిమా ఉంటే తనకు సలహా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కొందరి నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఖాళీగా ఉండే బదులు ఆన్ లైన్ ద్వారా ప్రజలకు సేవలందించాలని ట్వీట్లు చేశారు.


ఇక ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) ఘాటుగా స్పందించారు. రెస్ట్ తీసుకునేందుకేనా.. ప్రజలకు తమకు అధికారం ఇచ్చిందని ఇటీవలే ప్రశ్నించారు. 


Read more