పోడు భూములపై మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-15T19:47:19+05:30 IST

పోడు భూముల సమస్యల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.

పోడు భూములపై మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

సిరిసిల్ల: పోడు భూముల సమస్యలపై మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమే పోడు భూముల చట్టాన్ని సవరణ చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పోడు భూముల చట్టాన్ని సవరణ చేయాలని, కేంద్రం చట్ట సవరణ చేస్తే వెంటనే పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి(bjp, congress) పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి తెస్తే వాళ్ల చేతితోనే గిరిజనులకు పట్టాలు ఇప్పిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ ఉండదన్నారు. ట్రైబల్ హక్కులను కాలరాసే యాక్ట్‌లను కేంద్రం తెస్తోందని చెప్పారు. పార్లమెంట్‌లో ఆ యాక్ట్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. 12లక్షల ఎకరాల పట్టాలు అవ్వాలని లెక్కలు వస్తున్నాయన్నారు. ROFR చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కట్ ఆఫ్ డేట్ పెంచి, ROFR చట్టాన్ని సవరణ చేస్తే పోడు భూముల సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Read more