ఎస్సీల పేదరికాన్ని పూర్తిగా రూపు మాపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు-మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2022-02-24T01:43:19+05:30 IST

రాష్ట్రంలోని ఉన్న దాదాపు 17 లక్షల ఎస్సీ కుటుంబాల పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కంకణబద్ధులై ఉన్నరని ఎస్సీ,మైనారీటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఎస్సీల పేదరికాన్ని పూర్తిగా రూపు మాపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు-మంత్రి కొప్పుల

హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్న దాదాపు 17 లక్షల ఎస్సీ కుటుంబాల పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కంకణబద్ధులై ఉన్నరని ఎస్సీ,మైనారీటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విమర్శకుల తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ రికార్డు సమయంలో అత్యద్భుతంగా పూర్తి చేశారని,ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ దళితబంధు పథకానికి రూపకల్పన చేసి, విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక చేయూతతో మొబైల్ టిఫిన్ సెంటర్లు నడుపుతున్న వారికి మాంసం, చికెన్ లతో స్నాక్స్ తయారు చేయడంపై చెంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధన సంస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈకార్యక్రకమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావొస్తున్నది.ఇటీవలే వరంగల్, కరీంనగర్ లలో పలువురికి హార్వెస్టర్లు,జెసిబిలు,ట్రాక్టర్లను అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. డ్రైవర్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ వాళ్లిప్పుడు,వాటి ఓనర్లుగా మారారు.దళితబంధు పథకం ఎస్సీలకు గొప్ప "జీవనబంధు"గా మారిందన్నారు. ఇటువంటి మహత్తరమైన పథకం ఒక తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ పథకం అమలునకు 20 నుంచి 25 వేల కోట్లను ముఖ్యమంత్రి కేసిఆర్ కేటాయించనున్నారు. దీంతో, వచ్చే ఐదారేళ్లలో 17 లక్షల కుటుంబాలు,అంటే సుమారు 70 లక్షల మంది బాగుపడతారు,వారి జీవితాలలో వెలుగులు ప్రసరిస్తాయి. 


ఎస్సీ కార్పొరేషన్ సాయంతో టిఫిన్ సెంటర్లు నడుపుతున్న వారికి ఈ సంస్థలో అవగాహన,శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రజలలో పౌష్టికాహారంపై మక్కువ పెరిగింది,ఇండ్లకు పార్సిళ్లు తీసుకుపోవడం,తెప్పించుకోవడం సర్వ సాధారణమైంది. ఈ అవగాహన కార్యక్రమంలో ములుగు, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు చెందిన 50 మంది టిఫిన్ సెంటర్ల యజమానులు పాల్గొన్నారు.టిఫిన్ సెంటర్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఈ విధంగా అవగాహన,శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం పట్ల లబ్ధిదారులు పద్మావతి,నర్సయ్య, చిరంజీవి,శ్రీనివాసులు మంత్రి కొప్పులఈశ్వర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Read more