TS News: బీజేపీ నాయకులకు పని తక్కువ.. మాటలు ఎక్కువ: మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-09-25T22:32:38+05:30 IST

బీజేపీ నాయకులకు పని తక్కువ.. మాటలు ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తునికి-ఖల్సాలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వణాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇళ్లను పంపిణీ చేశారు.

TS News: బీజేపీ నాయకులకు పని తక్కువ.. మాటలు ఎక్కువ: మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట: బీజేపీ నాయకులకు పని తక్కువ.. మాటలు ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తునికి-ఖల్సాలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వణాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చెర్మన్ ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ హయాంలో ఇళ్ల పునాదులకే డబ్బులు సరిపోయేవీ కావనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(TS GOVT) వచ్చాక లబ్ధిదారులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు.


గతంలో గజ్వేల్‌( Ghazwal)లో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని కానీ గజ్వేల్ అభివృద్ధి చెందలేదని, సీఎం కేసీఆర్ వచ్చాక గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారిందన్నారు. 70 ఏళ్లలో కానీ అభివృద్ధి సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ప్రతీ మండలానికి ఎస్సీ వెల్ఫేర్, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కేసీఆర్ సర్కారులో ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పేద ప్రజల పార్టీ అని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని హిందూ-ముస్లిం తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారన్నారు.దేశంలోని 29 రాష్ట్రాల్లో ఫెయిల్ రాష్ట్రం గుజరాత్ అయితే.. అన్నింటా ఆదర్శ రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, అర్హులందరికీ ఆసరా ఫించన్లు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని మహమూద్ అలీ  పేర్కొన్నారు. 

Read more