ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-04-25T02:57:57+05:30 IST

ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రులు నిర్మిస్తామని మంత్రి హరీష్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న మూడు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులకు..

ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం: హరీష్‌రావు

హైదరాబాద్: ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రులు నిర్మిస్తామని మంత్రి హరీష్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 27న మూడు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. సనత్‌నగర్‌, అల్వాల్, ఎల్బీనగర్‌లో ఆస్పత్రులను నిర్మిస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు.  నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందస్తామన్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్య, విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానాలు నిర్మిస్తున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. 

Read more