మోదీ సభలో ‘మెగా’ సందడి

ABN , First Publish Date - 2022-07-05T09:27:32+05:30 IST

అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య ముచ్చట్లు అందరినీ ఆకర్షించాయి. కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా చిరంజీవికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీంతో అల్లూరి సభకు హాజ

మోదీ సభలో ‘మెగా’ సందడి

భీమవరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య ముచ్చట్లు అందరినీ ఆకర్షించాయి. కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా చిరంజీవికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీంతో అల్లూరి సభకు హాజరైన చిరంజీవి వేదికపై మోదీని శాలువాతో సత్కరించారు. ఇరువురు పరస్పరం వందనం చేసుకున్నారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. చిరునవ్వులు చిందించారు. చిరంజీవిని ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి జగన్‌, చిరంజీవి పరస్పరం పలకరించుకుని, నవ్వులు చిందిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సన్నివేశమూ అందరినీ ఆకట్టుకుంది.


Read more