కోదండరాంతో కాంగ్రెస్‌ నేతల భేటీ

ABN , First Publish Date - 2022-08-17T10:42:56+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు కోసం కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం మంగళవారం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో కలిసి చర్చించింది.

కోదండరాంతో కాంగ్రెస్‌ నేతల భేటీ

‘మునుగోడు’లో మద్దతు కోసం చర్చ

హైదరాబాద్‌,ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు కోసం కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం మంగళవారం టీజేఎస్‌ అధ్యక్షుడు  కోదండరాంతో కలిసి చర్చించింది. కాంగ్రె్‌సకు మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని భేటీ తర్వాత కోదండరాం తెలిపారు. కాగా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో సిద్ధాంతపరంగా కలిసొచ్చే పార్టీల మద్దతు తీసుకుంటామన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆదేశాలతో  కోదండరాంను కలిసి ఉప ఎన్నికపై చర్చించినట్టు చెప్పారు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా టీజేఎస్‌ మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అయితే, పార్టీలో ఈ అంశంపై చర్చించిన అనంతరం మద్దతుపై నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం చెప్పారని ఆయన పేర్కొన్నారు. మల్లు రవి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అందరి మద్దతు కోరతామని అన్నారు. 

Read more