అనాథాశ్రమాలు, శిశు కేంద్రాల్లో వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-06-07T08:59:08+05:30 IST

అనాథ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌

అనాథాశ్రమాలు, శిశు కేంద్రాల్లో వైద్య పరీక్షలు

మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

సమగ్ర వైద్య పరీక్ష కార్యక్రమం ప్రారంభం 


హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అనాథ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలోని అనాథాశ్రమాలు, శిశు సంరక్షణ కేంద్రాల్లో పిల్లలందరికి మల్టీస్పెషాల్టీ స్థాయిలో పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఛాయిస్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో చేపట్టిన ‘సమగ్ర వైద్య పరీక్ష’ కార్యక్రమాన్ని కమిషనర్‌ కార్యాలయంలో సత్యవతి రాథోడ్‌ సోమవారం ప్రారంభించారు. చిన్నారులకు వైద్య పరీక్షల్ని ప్రారంభించి, వారికి ఆరోగ్య కార్డులు అందించారు. మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు చిన్న వయస్సులో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చేయవచ్చన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఆరోగ్య పరీక్షల్ని అనాథ పిల్లలకు ఉచితంగా చేయడం గొప్ప విషయమన్నారు. ఆరోగ్య పరీక్షల వివరాలను డిజిటలైజ్‌ చేసి భద్రపర్చడం వల్ల ప్రభుత్వం నిర్వహిస్తున్న 24 అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పాత సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.  ‘ఛాయిస్‌ ఫౌండేషన్‌’కు మంత్రి సత్యవతి రాథోడ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Read more