మేడారంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-05-30T05:57:16+05:30 IST

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి
మేడారం వనదేవతల గద్దెల వద్ద భక్తుల రద్దీ

మేడారం, మే 29 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం సందడి నెలకొంది.  వివిఽధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు చీరె, సారె, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, బెల్లం సమర్పించారు. యాట మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా చూడాలని వనదేతలను వేడుకున్నారు. కుటుంబ సమేతంగా వంటావార్పు చేసుకొని సేద తీరారు. గద్దెల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థ పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. మరోవైపు మేడారంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-05-30T05:57:16+05:30 IST