పండ్ల మార్కెట్లో మేడారం బస్టాండ్‌

ABN , First Publish Date - 2022-01-29T05:26:29+05:30 IST

పండ్ల మార్కెట్లో మేడారం బస్టాండ్‌

పండ్ల మార్కెట్లో మేడారం బస్టాండ్‌
లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో మేడారం బస్టాండ్‌ ఏర్పాటు కోసం పరిశీలిస్తున్న ఆర్టీసీ, పోలీసు అధికారులు

వరంగల్‌టౌన్‌,  జనవరి 28: వరంగల్‌ లక్ష్మీపురంలో మేడారం బస్టాండ్‌ను ఏర్పాటు చేసేందుకు శుక్రవారం వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌, ఇంతేజార్‌గంజ్‌ సీఐ మల్లేశం, ఆర్టీసీ వరంగల్‌ మేనేజర్‌ మోహన్‌ స్థల పరిశీలన జరిపారు.  కొన్నేళ్లుగా పండ్ల మార్కెట్‌లోనే మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రానున్న జాతరకు కూడా బస్టాండ్‌ ఏర్పాటు కోసం అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆర్టీసీ మేనేజర్‌ మోహన్‌, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రాహుల్‌ను కలిసి ఫిబ్రవరి 11 నుంచి పండ్ల మార్కెట్‌ను తాత్కాలిక బస్టాండ్‌గా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్‌ 2 కార్యదర్శి చందర్‌రావు, జన్ను భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more