నేటి నుంచి జోనల్‌ గురుకుల క్రీడోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-25T05:04:45+05:30 IST

హత్నూరలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జోనల్‌ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీవో భీమయ్య, ప్రిన్సిపాల్‌ వివేకానంద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి జోనల్‌ గురుకుల క్రీడోత్సవాలు

హత్నూర, సెప్టెంబరు 24: హత్నూరలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జోనల్‌ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీవో భీమయ్య, ప్రిన్సిపాల్‌ వివేకానంద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌ 14, 17, 19 విభాగాల్లో ఖోఖో, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. క్రీడోత్సవాల్లో గురుకుల పాఠశాల కళాశాలల నుంచి 930మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటారని, 60మంది అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నట్టు తెలిపారు. క్రీడాకారులకు భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలు  రాష్ట్రస్థాయి గురుకుల క్రీడోత్సవాల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. 

Read more