యజమాని మృతితో.. కన్నీరు పెట్టిన శునకం

ABN , First Publish Date - 2022-09-26T04:58:44+05:30 IST

తనను అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని చనిపోవడంతో శునకం కన్నీరు పెట్టిన సంఘటన కోహీర్‌లో చోటు చేసుకుంది.

యజమాని మృతితో.. కన్నీరు పెట్టిన శునకం
యజమాని మృతదేహం వద్ద కూర్చున్న శునకం

జహీరాబాద్‌, సెప్టెంబరు 25: తనను అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని చనిపోవడంతో శునకం కన్నీరు పెట్టిన సంఘటన కోహీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కోహీర్‌లోని కస్బా కాలనీకి చెందిన కమ్మరి రాచయ్య రెండేళ్ల క్రితం శునకాన్ని తీసుకువచ్చి పెంచుకున్నాడు. శనివారం రాత్రి కమ్మరి రాచయ్య అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు రాచయ్య మృతదేహం వద్ద కూర్చొని విలపించారు. రాచయ్య పెంచుకున్న శునకం సైతం ఆయన మృతదేహం వద్ద కూర్చుని కంటనీరు పెట్టిన తీరును చూసి పలువురు కన్నీరు పెట్టారు. అంతేకాకుండా రాచయ్య మృతదేహాన్ని ఖననం చేసేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లేంతవరకు ఆ శునకం ఏమీ తినకుండా ఆయన మృతదేహం వద్దే కూర్చుండి పోయింది.Read more