డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇంకెప్పుడిస్తరు?

ABN , First Publish Date - 2022-10-13T04:57:29+05:30 IST

ఫసల్‌వాది గ్రామ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద లబ్ధిదారులు బుధవారం ఆందోళన చేపట్టారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇంకెప్పుడిస్తరు?

  ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన


సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 12: ఫసల్‌వాది గ్రామ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద లబ్ధిదారులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు. 329 ఇళ్లకు 6,500 మంది దరఖాస్తు చేసుకోగా, 1,378 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. వారికి పంపిణీ చేసేందుకు ఆగస్టు 3 న డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారికి నంబర్లు కూడా అలాట్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో లిస్టు వేశారు. కానీ ఇప్పటి వరకూ ఇళ్లను కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఇళ్లను ఇవ్వకుంటే తామే స్వాఽధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎండి.ఆసీఫ్‌, ఫయాస్‌, బాబా, మాధవి, ఖాసిమ్‌, ఆస్రాబేగం, అఫ్రోజ్‌ సుల్తానా, మల్లేశ్వరి పాల్గొన్నారు.


 

Read more