కల్యాణం..కమనీయం

ABN , First Publish Date - 2022-04-10T05:30:00+05:30 IST

తీరొక్క పందిళ్లు.. మేళతాళాల చప్పుళ్లు.. ఎదుర్కోళ్లు..పూజారుల వేద మంత్రాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. వెరిసి సీతారాముల కల్యాణం ఆదివారం కన్నువపండువగా జరిగింది.

కల్యాణం..కమనీయం
మెదక్‌లోని కోదండరామాలయంలో కల్యాణం జరిపిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు 

ఉదయం నుంచే కిటకిటలాడిన ఆలయాలు

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో పట్టువస్ర్తాలు,

ముత్యాల  తలంబ్రాలను సమర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దంపతులు


 మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌10: తీరొక్క పందిళ్లు.. మేళతాళాల చప్పుళ్లు.. ఎదుర్కోళ్లు..పూజారుల వేద మంత్రాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. వెరిసి సీతారాముల కల్యాణం ఆదివారం కన్నువపండువగా జరిగింది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉదయం నుంచి రామాలయాలవద్ద భక్తులు బారులు తీరారు. 

 మెదక్‌లోని కోదండ రామాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి దంపతులు పాల్గొని దేవతామూర్తులకు పట్టువస్ర్తాలను, ముత్యాలతలంబ్రాలను సమర్పించారు. ఆలయ ప్రధానఅర్చకులు భాష్యం మధుసూదనాచార్యులు, వేదపండితులు రంగచార్యులు, ప్రసాదశర్మ, లింగమూర్తిశర్మ, వెంకటకృష్ణమాచార్యులు మంత్రోచ్ఛరణల నడుమకల్యాణం యనానందకరంగా సాగింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభా్‌షరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్‌ చైర్మన్‌ దంపతులు కల్యాణమాలలతో నృత్యాలు చేశారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. దాదాపు పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్‌, సభ్యులు బాల్‌రాజ్‌, పురోషోత్తం, నందిని శ్రీను, దేవేందర్‌రెడ్డి, సకిలం శ్రీను, మల్లేశం, బద్రినాథ్‌, గోపాలకృష్ణ తదితరులు ఏర్పాట్లు చేశారు. పట్టణ సీఐ మధు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. వేడుకల్లో మెదక్‌ జడ్పీవై్‌సచైర్మన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ బట్టి జగపతి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మలికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్లు ఎలవర్తి జయశ్రీ దుర్గాప్రసాద్‌, రాగి వనజ, గాయత్రి, గడ్డమీది యశోద, లలిత, ఆర్కే శ్రీను, సమీవొద్దిన్‌ పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డిటౌన్‌/సంగారెడ్డిఅర్బన్‌, ఏప్రిల్‌ 10: సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీతారాముల కల్యాణ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సంగారెడ్డిపాత బస్టాండ్‌ సమీపంలోని రామమందిరంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవంలో జగ్గారెడ్డి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి  దంపతులు తమ నివాసం నుంచి మంగళవాయిద్యాలతో ఉత్సవమూర్తులకు ధరించే బంగారు ఆభరణాలను కుటుంబ సమేతంగా ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.  మహేశ్వరశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో కల్యాణం కన్నులపండువగా జరిగింది. కల్యాణం అనంతరం 175 కిలోల ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు భక్తులకు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వరశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేకయాగంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, పలువురు పాల్గొన్నారు. 

 పోతిరెడ్డిపల్లిపల్లి చౌరస్తాలోని వీరహనుమాన్‌ ఆలయంలో స్థానిక కౌన్సిలర్‌ స్రవంతి విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో, బ్యాంక్‌ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కౌన్సిలర్‌ నాయికోటి రామప్ప ఆధ్వర్యంలో జరిగిన కల్యాణ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, టీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ పట్నం మాణిక్యం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బైపాస్‌ రోడ్డులోని హరిహరక్షేత్రం, సాయిబాబా మందిరాల్లో వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. రాజంపేటలోని బ్రాహ్మణ సంఘం కార్యాలయ ఆవరణలో కల్యాణ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 

సీతారాముల కల్యాణం జరిపించిన జడ్పీచైర్‌పర్సన్‌

జోగిపేట: సంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి దంపతులు అందోలు మండలం డాకూరులో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని వీరభద్ర ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున సీతారాముల ఉత్సవ విగ్రహాలకు పల్లకీసేవ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించారు. జడ్పీచైరపర్సన్‌ దంపతులు దేవతామూర్తులకు పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Read more