వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-02-17T03:41:00+05:30 IST

అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ ఖేడ్‌ డివిజన్‌ కన్వీనర్‌ చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం వీఆర్‌ఏలు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 16: అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ ఖేడ్‌ డివిజన్‌ కన్వీనర్‌ చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం వీఆర్‌ఏలు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ వీఆర్‌ఏలుగా అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. అందువల్ల అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

Read more