నంగునూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా వేణుగోపాల్‌

ABN , First Publish Date - 2022-05-31T05:28:19+05:30 IST

నంగునూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఎంపీవో బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ను నియమిస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో రమేష్‌ ఉత్తర్వులు జారీచేశారు.

నంగునూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా వేణుగోపాల్‌

నంగునూరు, మే 30: నంగునూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఎంపీవో బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ను నియమిస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో రమేష్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. నంగునూరు ఎంపీడీవో మధుసూదన్‌ పంచాయతీ కార్యదర్శులను వేధింపులకు గురిచేస్తున్నారని ఇటీవల జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో పాలమాకుల పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి వివిధ పత్రికల్లో వచ్చిన నేపథ్యంతో స్పందించిన ఉన్నతాధికారులు మధుసూదన్‌ను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా కార్యాలయానికి అటాచ్‌ చేశారు. 

Read more