దేశ్‌ముఖ్‌ దొరలను వణికించిన వీరవనిత ఐలమ్మ

ABN , First Publish Date - 2022-09-27T05:14:12+05:30 IST

నిజాం పాలకులకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, రజక సంఘం నాయకులు అన్నారు.

దేశ్‌ముఖ్‌ దొరలను వణికించిన వీరవనిత ఐలమ్మ
పుల్కల్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజూశ్రీ

పుల్‌కల్‌/పటాన్‌చెరు/వెల్దుర్తి/జహీరాబాద్‌/నారాయణఖేడ్‌/మెదక్‌ అర్బన్‌,  సెప్టెంబరు 26: నిజాం పాలకులకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం    పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, రజక సంఘం నాయకులు అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ  127వ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామాల్లో నిజాం పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్న దేశ్‌ముఖ్‌లు, పటేల్‌, పట్వారీలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాల్లో పర్యటిస్తూ సంఘటితం చేశారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు చాకలి ఐలమ్మ పోరాటం ప్రేరణగా నిలిచిందని, ఆమె పోరాటం, తెగువ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. భూస్వామ్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, బందగీ వంటి తెలంగాణ సాయుధులు నాడు పోరాడకపోతే మనం స్వేచ్ఛ వాయువులను పీల్చేవాళ్లం కాదని పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి అనితర సాధ్యమని, తెలంగాణ స్వరాజ్యం కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. పుల్కల్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, బజరంగ్‌ దళ్‌ నాయకుడు సుభా్‌షచందర్‌ సోమవారం ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెల్దుర్తి మండలంలోని మానేపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, ఎంపీపీ స్వరూపానరేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ మండే మార్కెట్‌లోని విగ్రహానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు,  నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం,  రజక సంఘం నాయకులు, మెదక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌ తదితరులు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

వట్‌పల్లి/చిన్నశంకరంపేట/అల్లాదుర్గం/రాయికోడ్‌/పెద్దశంకరంపేట/రేగోడు/కల్హేర్‌/నాగల్‌గిద్ద/చేగుంట/మాసాయిపేట/పాపన్నపేట/రామాయంపేట/చిల్‌పచెడ్‌/న్యాల్‌కల్‌, సెప్టెంబరు 26:  వట్‌పల్లిలో రజక సంఘం మండలాధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు పుష్పలత, సంఘం బాధ్యులు, చిన్నశంకరంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌ రాజీరెడ్డి, సర్పంచులు, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం, అల్లాదుర్గంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కాళ్ల రాములు, రజక సంఘం మండలాధ్యక్షుడు నర్సింలు, రాయికోడ్‌లో రజక సంఘం నాయకులు శ్రీనివాస్‌, అంజయ్య, నర్సింలు, మొగులయ్య, రాములు, పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, ఎంపీటీసీలు వీణాసుభా్‌షగౌడ్‌, స్వప్నరాజేశ్వర్‌, దత్తు, రజక సంఘం బాధ్యులు, రేగోడులో మర్పల్లి సర్పంచ్‌ సిద్ధారెడ్డి, రజక సంఘం మండలాధ్యక్షుడు రాములు, కల్హేర్‌ మండలంలోని నాగ్‌ధర్‌, మండల కేంద్రమైన సిర్గాపూర్‌లో సంగారెడ్డి జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి, నాగ్‌ధర్‌ ఉప సర్పంచ్‌ అడివప్ప, సిర్గాపూర్‌ మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంజీవ్‌రావ్‌ పాటిల్‌, నాగ్‌ధర్‌ సర్పంచ్‌ పోతరాజు రవి, నాగల్‌గిద్ద మండలం కారముంగిలో శర్ణప్ప, శ్రావణ్‌కుమార్‌, బీమన్న, మారుతిపటేల్‌, చేగుంట, నార్సింగిలలో ఎస్‌ఐ నర్సింహులు, నాయకులు రాజేష్‌, భూపతి, మల్లేశంగౌడ్‌, మాసాయిపేటలో రజక సంఘం నాయకులు పాపన్నగారి వేణు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, పాపన్నపేటలో రజక సంఘం నాయకులు కడారి ప్రభు, పీరయ్య, శ్రీకాంత్‌, వెంకటేశం, ప్రవీణ్‌, కుమార్‌, శేఖర్‌, భాగయ్య, మల్లేశం, రామాయంపేటలో రజక సంఘం నాయకులు చాకలి వెంకటి, మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌ గౌడ్‌, చిల్‌పచెడ్‌ మండలం అంతారంలో సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌,  మాజీ సర్పంచ్‌ రామాగౌడ్‌, న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌లో జడ్పీటీసీ స్వప్నాభాస్కర్‌, ఎంపీపీ అంజమ్మ, ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌, ఎంపీటీసీ, సర్పంచులు తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలిఐలమ్మ సాహసోపేత జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.Read more