రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-10-09T04:20:29+05:30 IST

రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి.

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 8: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం రాత్రి మెదక్‌ మండల పరిధిలోని నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ సురేందర్‌, హోంగార్డు జనార్దన్‌ మెదక్‌ టౌన్‌లో పని చేస్తున్నారు. విధి నిర్వహణ కోసం పట్టణానికి వస్తుండగా మార్గమధ్యలో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్‌ కాలు విరగగా.. కానిస్టేబుల్‌ సురేందర్‌, మరో బైక్‌పై వస్తున్న వరిగుంతం గ్రామానికి చెందిన అశోక్‌ కూడా స్వల్ప గాయాలయ్యాయి.  రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 

Read more