త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-18T04:48:21+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌ పట్టణంలో బుధవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ సేవా సమితి ఆధ్వర్యంలో 1000 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అన్ని పాఠశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు జాతీయ పతాకాన్ని పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లు, డీజేసౌండ్‌లతో ర్యాలీ హోరెత్తింది.

త్రివర్ణ శోభితం
హుస్నాబాద్‌ పట్టణంలో నిర్వహిస్తున్న ర్యాలీ

హుస్నాబాద్‌ పట్టణంలో 1000 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ 


హుస్నాబాద్‌, ఆగస్టు 17 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌ పట్టణంలో బుధవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ సేవా సమితి ఆధ్వర్యంలో 1000 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అన్ని పాఠశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు జాతీయ పతాకాన్ని పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లు, డీజేసౌండ్‌లతో ర్యాలీ హోరెత్తింది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ, నెహ్రూ, మల్లెచెట్టు చౌరస్తా, వ్యవసాయ మార్కెట్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి జగదీశ్వర్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలో జాతీయభావం, దేశభక్తిని కలిగించేందుకు వెయ్యి మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు నాగిరెడ్డి విజయపాల్‌రెడ్డి, పెందోట అనిల్‌, గొల్లపల్లి వీరాచారి, బదిపడగ జైపాల్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, సతీష్‌, చందు, అజయ్‌, ప్రశాంత్‌, శ్రీను, కార్తిక్‌, శ్రీనివాస్‌చారి, నరసింహచారి, శ్రీకాంత్‌చారి, రవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T04:48:21+05:30 IST