కేసీఆర్‌ సభకు భారీగా తరలిన గిరిజనులు

ABN , First Publish Date - 2022-09-18T05:29:24+05:30 IST

హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్‌ పాల్గొనే బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌ ప్రారంభోత్సవాలు, గిరిజన, ఆదివాసుల ఆత్మ సమ్మేళన బహిరంగ సభలో పాల్గొనేందుకు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు మండలాల నుంచి గిరిజనులు భారీగా తరలి వెళ్లారు.

కేసీఆర్‌ సభకు భారీగా తరలిన గిరిజనులు

 నారాయణఖేడ్‌/పుల్‌కల్‌/హత్నూర/జహీరాబాద్‌/చిన్నశంకరంపేట/ చిల్‌పచెడ్‌/నర్సాపూర్‌/, సెప్టెంబరు 17: హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్‌ పాల్గొనే బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌ ప్రారంభోత్సవాలు, గిరిజన, ఆదివాసుల ఆత్మ సమ్మేళన బహిరంగ సభలో పాల్గొనేందుకు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు మండలాల నుంచి గిరిజనులు భారీగా తరలి వెళ్లారు. సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా గిరిజనుల జనాభా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోనే ఉండటంతో తరలించేందుకు మొత్తం 86 బస్సులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. చౌటకూర్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంకు చెందిన గిరిజనులు హైదరాబాద్‌కు బస్సుల్లో భారీగా తరలివెళ్లారు.  గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు, సీడీసీ డైరెక్టర్‌ జైపాల్‌నాయక్‌ అధ్వర్యంలో గిరిజన మహిళలు ఆర్టీసీ బస్సులో తరలివెళ్లారు. హత్నూర మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు బస్సుల్లో తరలివెళ్లారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కోహీర్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, ఝరాసంగం, జహీరాబాద్‌ మండలాలకు చెందిన గిరిజనులు ప్రత్యేక బస్సుల్లో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు కోహీర్‌ మండలం కవేలి చౌరస్తా వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల నుంచి గిరిజనులు టీఆర్‌ఎస్‌ మండలాక్షుడు రాజు ఆధ్వర్యంలో తరలివెళ్లారు. చిల్‌పచెడ్‌ మండలానికి చెందిన గిరిజన నాయకులు తరలివెళ్లారు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి గిరిజనులు 50కి పైగా ఆర్టీసీ బస్సుల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. శివ్వంపేట మండలం నుంచి ఆత్మీయ సమావేశానికి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.  


 


Updated Date - 2022-09-18T05:29:24+05:30 IST