అక్రమంగా డీజిల్‌ తరలిస్తున్న ట్యాంకర్ల పట్టివేత

ABN , First Publish Date - 2022-09-19T05:47:07+05:30 IST

కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి రెండు ట్యాంకర్లలో అక్రమంగా తరలిస్తున్న 30 వేల లీటర్ల డీజిల్‌ను శనివారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా డీజిల్‌ తరలిస్తున్న ట్యాంకర్ల పట్టివేత

జహీరాబాద్‌, సెప్టెంబరు 18: కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి రెండు ట్యాంకర్లలో అక్రమంగా  తరలిస్తున్న 30 వేల లీటర్ల డీజిల్‌ను శనివారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో డీజిల్‌ రేటు తక్కువగా ఉండడం వల్ల అక్కడ కొనుగోలు చేసిన డీజిల్‌ను అక్రమంగా రెండు ట్యాంకర్లలో తెలంగాణ ప్రాంతానికి తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్న ఆయనేని యాదగిరి, పటాల శేఖర్‌, వీరారెడ్డి సాయిరాం తేజ, తొట్టెంపూడి సాయిరాం సూర్య, హుసేన్‌ కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


Read more