జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో తొగుటకు ప్రథమస్థానం

ABN , First Publish Date - 2022-08-18T04:38:15+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేట బాలుర కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో తొగుట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించారు.

జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో తొగుటకు ప్రథమస్థానం

తొగుట, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేట బాలుర కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో తొగుట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించారు. వివిధ క్రీడాంశాల్లో భాగంగా బుధవారం వాలీబాల్‌ క్రీడలు నిర్వహించారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాగా సిద్దిపేట బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థులకు, తొగుట కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఫైనల్స్‌ పోటీలో తొగుట జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. ప్రథమ స్థానంలో గెలుపొందిన విద్యార్థుల జట్టును జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సూర్యప్రకాష్‌, బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం విద్యార్థులను అభినందించారు. 

Read more