నేడు స్వాతంత్య్ర సమరయోధులకు, కళాకారులకు సన్మానం

ABN , First Publish Date - 2022-09-18T05:16:05+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సిద్దిపేట పట్టణంలోని నెక్లెస్‌ రోడ్డు వద్ద స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

నేడు స్వాతంత్య్ర సమరయోధులకు, కళాకారులకు సన్మానం

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సిద్దిపేట పట్టణంలోని నెక్లెస్‌ రోడ్డు వద్ద స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. శనివారం కోమటిచెరువు నెక్లెస్‌ రోడ్డును పరిశీలించారు. టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న డాల్ఫిన్‌ వాటర్‌ ఫౌంటేన్‌, లవ్‌ సిద్దిపేట, కోమటిచెరువు సందర్శనకు వచ్చినవారు కూర్చోవటానికి ఏర్పాటు చేసిన వివిధ రకాల జంతువులు, ఫలాల ఆకారంలో ఉన్న కుర్చీలకు నూతన రంగులు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సంతోషిమాత ఆలయంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు వడ్లకొండ సాయి, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more