కస్తూర్బాలో సమయపాలనకు తిలోదకాలు

ABN , First Publish Date - 2022-03-17T04:29:05+05:30 IST

పాపన్నపేటలోని కస్తూర్బా పాఠశాలలో ఏఎ్‌సవోతో పాటు బోధన సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.

కస్తూర్బాలో సమయపాలనకు తిలోదకాలు

పాపన్నపేట, మార్చి 16: పాపన్నపేటలోని కస్తూర్బా పాఠశాలలో ఏఎ్‌సవోతో పాటు బోధన సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. కస్తూర్బా పాఠశాలలో ఏడుమంది బోధన సిబ్బంది, ఏఎ్‌సవో విధులు నిర్వహించాల్సి ఉండగా.. ప్రతీ రోజు ఎవరో ఒకరు గైర్హాజరు కావడం పరిపాటిగా మారింది. వచ్చిన సిబ్బంది కూడా సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులకు సరైన బోధన అందలేకపోతుంది. విషయమై ఎంఈవో నీలకంఠం దృష్టికి తీసుకెళ్లగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Read more