గ్రామపంచాయతీల్లో ఈ పంచాయతీ సేవలు కనుమరుగు!

ABN , First Publish Date - 2022-12-12T23:45:15+05:30 IST

మద్దూరు, డిసెంబరు 12: గ్రామపంచాయతీల పాలనలో పారదర్శకతను తెచ్చేందుకు 2015లో అమలుచేసిన ఈ పంచాయతీ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అటకెక్కింది.

గ్రామపంచాయతీల్లో ఈ పంచాయతీ సేవలు కనుమరుగు!

ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్న అధికారులు

పట్టింపులేని ప్రజాప్రతినిఽధులు

మద్దూరు, డిసెంబరు 12: గ్రామపంచాయతీల పాలనలో పారదర్శకతను తెచ్చేందుకు 2015లో అమలుచేసిన ఈ పంచాయతీ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అటకెక్కింది. దీంతో పౌరసేవలు అందకుండాపోయాయి. ప్రభుత్వం జిల్లాలోని 499 గ్రామపంచాయతీల్లో ఈ పంచాయతీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మండల పరిషత్‌ కార్యాలయాల్లోని గ్రామపంచాయతీ విస్తరణాధికారులతో పాటు క్లస్టర్‌ వారీగా గ్రామపంచాయతీలకు కంప్యూటర్లు, ప్రింటర్లను అందించింది. అందులో భాగంగానే మద్దూరు ఉమ్మడి మండలాల్లోని మద్దూరు, దూళిమిట్ట, రేబర్తి, నర్సాయపల్లి, లద్నూరు, కూటిగల్‌, బైరాన్‌పల్లి కొండాపూర్‌, అర్జున్‌పట్ల గ్రామపంచాయతీలకు కంప్యూటర్లు. ప్రింటర్లు చేరాయి. క్లస్టర్‌ వారీగా కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం చేపట్టినా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ సౌకర్యం సదుపాయాన్ని కల్పించకలేకపోయారు. దీంతో కొన్నేళ్ల వరకు పంచాయతీ సెక్రటరీలు ఈ పంచాయతీ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత పలురకాల ఇంటర్‌నెట్లు అందుబాటులోకి రావడంతో జనన, మరణ, ఇంటిపన్ను, నల్లా పన్నులు, ఇంటి అనుమతుల వంటి వివిధ రకాల సేవలను గ్రామస్థులకు అందించారు. సజావుగా కొనసాగుతున్న ఈ పంచాయతీ సేవలను గతంలో పనిచేసిన పంచాయతీ విస్తరణాధికారి ఒక్క మద్దూరును మినహాయించి మిగతా గ్రామపంచాయతీల్లోని కంప్యూటర్లను మండల పరిషత్‌ కార్యాలయానికి తరలించారు. కాగా ఉపాధిహామీ కూలీలకు చెల్లింపులు, ఆసరా పింఛన్లతో పాటు పంచాయతీ పరిధిలో ఉండే అన్నిరకాల సేవలను దీనిద్వారానే కొనసాగించారు. ఈ క్రమంలో పలు సాంకేతిక కారణాల వల్ల అన్ని కంప్యూటర్లు పాడైపోయాయి. అయితే వాటిని బాగుచేయించకుండా ఓ మూలనపడేశారు. మరోవైపు గ్రామపంచాయతీల నుంచి జీతభత్యాలు పొందుతున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు గ్రామపంచాయతీల వైపు తొంగిచూడకుండా మండల పరిషత్‌ కార్యాలయం నుంచే విధులు కొనసాగిస్తున్నారు. దీంతో వివిధ సర్టిఫికెట్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎంపీవోను వివర ణ కోరగా తాను రాకముందు నుంచే ఇక్కడ నుంచి ఈ పంచాయతీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Updated Date - 2022-12-12T23:45:15+05:30 IST

Read more