బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2022-11-27T23:50:31+05:30 IST

రాష్ట్ర సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్‌ నాయకులపై ఐటీ దాడులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
బైలంపూర్‌లో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి

ములుగు, నవంబరు 27: ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ములుగు మండలం కొండపోచమ్మసాగర్‌ ముంపు గ్రామమైన బైలంపూర్‌లో వాటర్‌ ప్లాంటును మంత్రి మల్లారెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తన సంస్థలపై ఐటీ దాడులు చేయించిందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ దూసుకుపోతుంటే జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని మరిచిపోయి బడా బాబులకు అండగా నిలుస్తుందని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఏ ప్రభుత్వాలు అయినా సామాన్య ప్రజలకు అభివృద్ధి పథకాలు అందించిన పార్టీలకే ప్రజలు పట్టం కడతారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ స్వాతిమధుసూదన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జహంగీర్‌, అర్జున్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోడూరు భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి జుబేర్‌, కొమురవెల్లి దేవస్థాన మాజీ డైరెక్టర్‌ ఐలేష్‌ యాదవ్‌, రామ్‌రెడ్డి, కొమురయ్య, ఫిర్దాజిగూడ మేయర్‌ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్‌ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:50:32+05:30 IST