ఆర్యవైశ్య మహిళల్లో చైతన్యం అవసరం

ABN , First Publish Date - 2022-07-04T05:19:54+05:30 IST

ఆర్యవైశ్య మహిళల్లో చైతన్యం అవసరమని, మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రావాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కాచం నవీన్‌గుప్తా అన్నారు.

ఆర్యవైశ్య మహిళల్లో చైతన్యం అవసరం
విద్యాధరి క్షేత్రం ప్రాంగణంలో గోరింటాకు సంబురాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహిళలు

ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు నవీన్‌గుప్తా

వర్గల్‌, జూలై 3: ఆర్యవైశ్య మహిళల్లో చైతన్యం అవసరమని, మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రావాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కాచం నవీన్‌గుప్తా అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి హేమలతగుప్తాతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారి పాదాల చెంత ఆషాఢమాసం సందర్భంగా జరిగిన గోరింటాకు సంబురంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాచేపల్లి వెంకటకృష్ణ కన్యకాపరమేశ్వరి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఆదేశాలతో జిల్లాలో మహిళలను చైతన్యపరుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మాడిశెట్టి హేమలతగుప్తా మాట్లాడుతూ ఆషాఢమాసంలో అమ్మవారు ఇచ్చే ప్రసాదంగా మహిళలు గోరింటాకును స్వీకరిస్తూ వస్తుండడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో జిల్లా మహిళా సదస్సు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ చంద్రశేఖర్‌శర్మ సిద్ధాంతికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా విభాగం ములుగు మండలాధ్యక్షురాలు శారద సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. 

వర్గల్‌ మండల మహిళా విభాగం నియామకం

వర్గల్‌ మండల మహిళా విభాగం అధ్యక్షురాలుగా బచ్చు మాధవి, సభ్యులుగా ప్రొద్దటూరి లక్ష్మి, బ్రహ్మాండ్లపల్లి సుధా, పెద్ది సునీత నియామకం కావడంతో వారిని జిల్లా అధ్యక్షరాలు హేమలతగుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే గజ్వేల్‌ కోఆప్షన్‌గా సభ్యులుగా ఎన్నికైన విజయలక్ష్మీసత్యనారాయణను శాలువాతో సన్మానించారు. 

మహిళల గోరింటాకు సంబురాలు 

హుస్నాబాద్‌, జూలై 3: హుస్నాబాద్‌ పట్టణంలోని వైశ్య భవన్‌లో ఆదివారం ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒక చోట చేరి మైదాకు తెంపుకవచ్చి రుబ్బి చేతులకు పెట్టుకున్నారు. 

Read more