ఘనంగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2022-04-11T05:22:34+05:30 IST

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పట్టువస్త్రాలు అలంకరించి శ్రీరామ, హనుమాన్‌ ఆలయాల్లో రాములవారి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారాముల కల్యాణం
నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో సీతారాముల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పట్టువస్త్రాలు అలంకరించి శ్రీరామ, హనుమాన్‌ ఆలయాల్లో రాములవారి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌ 10: సిద్దిపేట పట్టణం పారుపల్లి వీధిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అన్నదానంలో స్టీల్‌ బ్యాంక్‌ వాడకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

చేర్యాల: చేర్యాల పట్టణంలోని అభయాంజనేయ, మార్కండేయ, రామలింగేశ్వరాలయం, ఆది ఆంజనేయ, వేణుగోపాలస్వామి, గట్టుతోట, బీడీకాలనీ హనుమాన్‌ ఆలయంతో పాటు గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో శ్రీరామకళ్యాణాన్ని జరిపారు. వేడుకల్లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, కౌన్సిలర్లు నరేందర్‌, కనకమ్మ, భిక్షపతి, ఎంపీపీ కరుణాకర్‌, సర్పంచులు కృష్ణవేణి, ఎల్లారెడ్డి, భిక్షపతి, సంతోషి, స్వామి పాల్గొన్నారు.

నంగునూరు: నంగునూరు రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కోల రమేశ్‌ నేతృత్వంలో స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. బద్దిపడగలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నారాయణరావుపేట: లక్ష్మిదేవిపల్లి, జక్కాపూర్‌, నారాయణరావుపేట, గుర్రాలగొంది గ్రామాల్లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ బాలకృష్ణ, జడ్పీటీసీ లక్ష్మిరాఘవరెడ్డి, సర్పంచ్‌లు పరశురాములు, ఆంజనేయులు, మంజులశ్రీనివా్‌సరెడ్డి, శశియాదగిరి, వైస్‌ ఎంపీపీ సంతో్‌షకుమార్‌ పాల్గొన్నారు.

చిన్నకోడూరు: చంద్లాపూర్‌ లక్ష్మి రంగనాయక స్వామి గుట్టపై నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ హాజరయ్యారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్‌ చంద్రకళ, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, నాయకులు రవి, తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌రూరల్‌: పొట్లపల్లి రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్‌ సుశీల, దేవసాని నిర్మల తదితరులు పాల్గొన్నారు. పోతారం(ఎస్‌), మహ్మదాపూర్‌ గ్రామాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. 


 

Read more