డివైడర్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-10-14T05:30:00+05:30 IST

ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

డివైడర్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి

హుస్నాబాద్‌, అక్టోబరు 14: ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్‌లోని  సిద్దిపేటరోడ్డులో శ్రీచైతన్య స్కూల్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌కు చెందిన దొంతరబోయిన శివకృష్ణ(24) తన ఇంటి నిర్మాణం కోసం పందిళ్ల నుంచి ఇసుక లోడుతో ట్రాక్టర్‌ను నడుపుకుంటూ బయలుదేరాడు. అతివేగంగా ఉన్న ట్రాక్టర్‌ హుస్నాబాద్‌లోని శ్రీచైతన్య స్కూల్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కిందపడిన డ్రైవర్‌ శివకృష్ణ పైనుంచి ట్రాక్టర్‌ దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  శివకృష్ణకు ఏడాది క్రితమే అనూషతో వివాహం కాగా ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Read more