జీవనరేఖ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-09-09T05:15:13+05:30 IST

జీవనరేఖ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

జీవనరేఖ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం
ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

జగదేవపూర్‌, సెప్టెంబరు 8: జీవనరేఖ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిన్నకిష్ణాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవనరేఖ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాత భాస్కర్‌రెడ్డి సౌజన్యంతో రూ.75 వేలతో 160 మంది విద్యార్థులకు నూతన స్పోర్ట్స్‌ యూనిఫాం పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. నేడు ఈ స్థాయిలో ఉన్న అతిథులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, సర్పంచ్‌ కనకయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more