ప్రధాని మోదీ పాలనతోనే దేశ ప్రజలు సుభిక్షం

ABN , First Publish Date - 2022-06-12T04:22:57+05:30 IST

మోదీ పాలనతోనే దేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ అన్నారు.

ప్రధాని మోదీ పాలనతోనే దేశ ప్రజలు సుభిక్షం
సంగారెడ్డిలో నిర్వహించిన వికాస్‌ తీర్థ బైక్‌ ర్యాలీలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌

సంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 11: మోదీ పాలనతోనే దేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మోదీని కొనియాడుతూ శనివారం పోతిరెడ్డిపల్లి పీఎ్‌సఆర్‌ గార్డెన్‌ నుంచి పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు  వికాస్‌ తీర్థ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాయన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి మురళీధర్‌రెడ్డి, యువమోర్చా జిల్లా ఇన్‌చార్జి సాయిరాంగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేశ్‌, ఉపాధ్యక్షుడు నగేశ్‌, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు అశ్వంత్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేశ్‌, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. 

విజయోత్సవ సభను జయప్రదం చేయాలి

నారాయణఖేడ్‌, జూన్‌ 11: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా ఈనెల 14న నారాయణఖేడ్‌లో నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీరెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప కోరారు. శనివారం నారాయణఖేడ్‌లోని అతిఽథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. 

కేంద్ర పథకాల ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ

జిన్నారం, జూన్‌ 11: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బొల్లారం మున్సిపల్‌ బీజేపీ అధ్యక్షుడు భరత్‌చారి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచార పోస్టర్‌ను భరత్‌చారి, పార్టీ నాయకులు ఆవిష్కరించారు. 

Read more