చికిత్సపొందుతూ వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-08-22T05:23:39+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.

చికిత్సపొందుతూ వృద్ధురాలి మృతి

ఝరాసంగం, ఆగస్టు 21: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఎస్‌ఐ రాజేందర్‌ రెడ్డి కథనం ప్రకారం.... ఝరాసంగం గ్రామానికి చెందిన నాగమ్మ(60) శనివారం గ్రామంలోని ప్రధాన రహదారి దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కాళ్లు, చెయ్యి విరిగి తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరిలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతురాలు కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Read more