ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో ఆషాడ మాసం వంటావార్పు

ABN , First Publish Date - 2022-07-06T05:27:47+05:30 IST

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ చొరవతో సంగారెడ్డిలోని ఎఫ్‌ఆర్‌ఎ్‌స(ఫల పరిశోధన శాల)లో ఆషాడమాసం వేడుకల్లో వంటావార్పుతోపాటు రేణుకా ఎల్లమ్మకు నైవేద్య సమర్పణకు అనుమతి లభిచింది.

ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో ఆషాడ మాసం వంటావార్పు

  మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చొరవతో అనుమతి


సంగారెడ్డి టౌన్‌, జూలై 5: టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ చొరవతో సంగారెడ్డిలోని ఎఫ్‌ఆర్‌ఎ్‌స(ఫల పరిశోధన శాల)లో ఆషాడమాసం వేడుకల్లో వంటావార్పుతోపాటు రేణుకా ఎల్లమ్మకు నైవేద్య సమర్పణకు అనుమతి లభిచింది. కొన్నిసంవత్సరాలుగా ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో ఆషాడ మాసంలో వంటావార్పు, నైవేద్యాన్ని ఎఫ్‌ఆర్‌ఎస్‌ అధికారులు నిషేధించారు. పట్టణ ప్రజల వినతి మేరకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు మంగళవారం కలెక్టర్‌ ఎ.శరత్‌ను కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగజేయకుండా వంటావార్పుతో పాటు నైవేద్య సమర్పణకు అనుమతివ్వాలని సూచించడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అధికారులు అంగీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేణుకా మాత ఆలయం వద్ద రూ.20లక్షలతో ప్రత్యేకంగా షెడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చింతా ప్రభాకర్‌ తెలిపారు. Read more