గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

మండల పరిధిలోని నాగ్సన్‌పల్లి శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గుట్ట సమాదానం(58) అనే మహిళ తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే.

గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి

కౌడిపల్లి, సెప్టెంబరు 17: మండల పరిధిలోని నాగ్సన్‌పల్లి శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గుట్ట సమాదానం(58) అనే మహిళ తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Read more