అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-12-13T23:16:26+05:30 IST

గజ్వేల్‌, డిసెంబరు 13: అన్ని కులాల, అన్నివర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌, డిసెంబరు 13: అన్ని కులాల, అన్నివర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన అయ్యవార్ల సంఘం, హమాలీ సంఘం, యెరుకల సంఘం, ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘం, టూ వీలర్స్‌ అసోసియేషన్‌, పెయింటర్స్‌ అసోసియేషన్‌, మోచే సంఘానికి రెండున్నర గుంటల చొప్పున కేటాయించిన ప్రొసీడింగ్స్‌ను మంత్రి హరీశ్‌రావు ఆయా సంఘాల అధ్యక్షులకు అందజేసి మాట్లాడారు. అన్నివర్గాల, కులాల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అనంతరం టీఎస్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సూచనలు, హరీశ్‌రావు సహకారంతో త్వరలోనే మిగిలిన అసోసియేషన్లు, సంఘాలకు భూమిని కేటాయిస్తామని తెలిపారు. 8 సంఘాలకు భూమిని కేటాయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండలాధ్యక్షుడు నవాజ్‌మీరా, మధు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:16:27+05:30 IST