గోవులను తరలిస్తున్న డీసీఎం చక్రం ఊడి చెరుకు బండికి ఢీ

ABN , First Publish Date - 2022-06-12T04:27:41+05:30 IST

గోవులను తరలిస్తున్న డీసీఎం చక్రం ఊడి చెరుకు రసం బండిని ఢీకొన్న ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

గోవులను తరలిస్తున్న డీసీఎం చక్రం ఊడి చెరుకు బండికి ఢీ
ధ్వంసమైన చెరుకు రసం బండి, డీసీఎంలో తరలిస్తున్న పశువులు, (ఇన్‌సెట్‌లో) గాయపడిన మహిళ

మహిళకు తీవ్రగాయాలు

కంది, జూన్‌ 11: గోవులను తరలిస్తున్న డీసీఎం చక్రం ఊడి చెరుకు రసం బండిని ఢీకొన్న ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కంది శివారులోని 65వ నంబరు జాతీయ రహదారి పక్కన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కంది శివారులోని చేర్యాల గేటు ఎదురుగా ఉన్న హనుమాన్‌ మందిర్‌ వద్ద జాతీయ రహదారి పక్కన ఓ మహిళ (50) చెరుకు రసం బండిని నడుపుతున్నది. శనివారం 3 గంటల ప్రాంతంలో జాతీయరహదారిపై నుంచి  వెళ్తున్న డీసీఎం ముందరి టైరు ఒక్కసారిగా ఊడి రోడ్డు పక్కనే ఉన్న చెరుకు రసం బండిని ఢీకొట్టింది. ఘటనలో చెరుకు బండి పూర్తిగా ధ్వంసం కాగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారమందుకున్న  పోలీసులు 108 వాహనంలో బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా డీసీఎంలో తరలిస్తున్న ఆవులు, గేదెలను పోలీసులు  సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు.  డీసీఎం డ్రైవర్‌ పరారు కాగా,  కేసు దర్యాప్తు చేస్తున్నామని సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ శీనివా్‌సరెడ్డి తెలిపారు.  

Updated Date - 2022-06-12T04:27:41+05:30 IST