కేంద్రం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తోంది

ABN , First Publish Date - 2022-07-19T05:18:51+05:30 IST

కేంద్రం ప్రభుత్వం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

కేంద్రం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తోంది
సంగారెడ్డిలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో సీపీఐ జిల్లా మూడో మహాసభలో మాట్లాడుతున్న సాంబశివరావు

టీఆర్‌ఎ్‌సది అప్రజాస్వామిక పాలన

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

సంగారెడ్డి రూరల్‌, జూలై 18: కేంద్రం ప్రభుత్వం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సంగారెడ్డిలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మూడో మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వమే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పప్పు, నూనెల ధరలను అమాంతంగా పెంచుతూ, ధనికుల వాడే వజ్రాలపై జీఎస్టీని తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, అగ్నిపథ్‌ పేరిట దేశ రక్షణకు తూట్లు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. మహాసభలో ప్రకా్‌షరావు, మంద పవన్‌, యూసుఫ్‌, జిల్లా కార్యదర్శి జలాలొద్దిన్‌, రహ్మన్‌, తాజొద్దిన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T05:18:51+05:30 IST