గుమ్మడిదలలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-02T05:25:57+05:30 IST

గుమ్మడిదల కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుగు రోజులుగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.

గుమ్మడిదలలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న వేద పండితులు పాలకవర్గ సభ్యులు

 గుమ్మడిదల, అక్టోబరు 1: గుమ్మడిదల కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుగు రోజులుగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయ ఆవరణలో వేదపండితుల మంత్రోచ్ఛారణతో ఉదయం హవనం, సామూహిక కుంకుమార్చనలు, తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు.  శుక్రవారం రాత్రి  గరుడవాహన సేవలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.  

Read more